FbTelugu

ఆకాశంలోకి పీఎస్ఎల్వీ సీ51

శ్రీహరి కోట: ఇస్రో శాస్త్రవేత్తలు తొలి ప్రైవేటు వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం చరిత్ర సృష్టించనున్నది. 19 ఉపగ్రహాలతో ఉన్న పీఎల్ఎల్వీ సీ 51ను ఇవాళ ఉదయం 10.24కు రోదసిలోకి పంపించారు. ఇందులో ఒకటి పెద్ద ఉపగ్రహం కాగా మిగతావి చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి.

శ్రీహరి కోటలో ప్రయోగ వేదిక నుంచి ఇవాళ ఉదయం 10.24 కు పీఎస్ఎల్వీ సీ 51 నింగిలోకి దూసుకువెళ్లింది. ప్రయోగానంతరం రాకెట్ 1.55 నిమిషాల పాటు రోదసిలో పయనించనున్నది. రాకెట్ బయలుదేరిన 17.23 నిమిషాలకు బ్రెజిల్ కు చెందిన అమెజోనియా 1 ఉపగ్రహాన్ని సన్ సింక్రనైజ్ పోలార ఆర్బిట్ లోకి చేరవేయనున్నది. ఆ తరువాత నాలుగు నిమిషాలకు మిగిలిన 18 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలిపెడుతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.