FbTelugu

తెలంగాణ బిడ్డ అయితే నిరూపించుకో: రేవంత్

హైదరాబాద్: ఐటీ మంత్రి కేటీఆర్ కు జన్వాడలో 301-13 సర్వే నెంబర్లలో భూములు లేవన్న ఆయన మాటలు పచ్చి అబద్ధమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి ఖండించారు.

కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే బయటకు వచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. సర్వే నెంబర్లు 301-313 వరకు నాకు ఎలాంటి భూములు లేవని కేటీఆర్ ట్విట్టర్ లో చెప్పడం శుద్ధ అబద్దమని రేవంత్ స్పష్టం చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జన్వాడ లో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. 2019 మార్చి 7వ తేదీన 301 సర్వే నెంబర్ లో రెండు ఎకరాలు కేటీఆర్, ఆయన భార్య శైలిమ పేరుమీద భూమి రిజిస్ట్రేషన్ అయిందని అన్నారు. 2018 ఎన్నికల అఫిడవిట్ లో రూ.2కోట్ల ఆస్తులు జన్వాడ అర్బనా వెంచర్స్ పేరుమీద ఉన్నట్లు స్వయంగా కేటీఆర్ వెల్లడించారని రేవంత్ రెడ్డి తెలిపారు.

25 ఎకరాల్లో రాజమహల్ లాంటి ఫామ్ హౌస్…

జన్వాడలో 25 ఎకరాల్లో 1లక్ష చదరపు అడుగులలో మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారు. మార్చి 5న డ్రోన్ ఉపయోగించారని నన్ను అక్రమంగా జైలు కి పంపారు. రేవంత్ రెడ్డి వల్ల సీఎం కేసీఆర్-కేటీఆర్ ఆస్తులు, ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీసులు నివేదికలు ఇచ్చారన్నారు. అదే నివేదికలో కేటీఆర్ భూములు ఉన్నాయని, కేటీఆర్ కుటుంబం నివసిస్తుందని కోర్టుకు నివేదదిక సమర్పించారన్నారు.

జన్వాడ గ్రామంలో కేటీఆర్ కి రెండు ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. నేను ఆరోపణలు  చేస్తోంది 301 సర్వే నంబర్ ఉన్న భూముల గురించి, ఎమ్మెల్యే బాల్క సుమన్ వేరే భూముల గురించి చెప్పి పక్కదారి పట్టిస్తున్నాడన్నారు. రేవంత్ రెడ్డి ఆరోపణల్లో ఒక్క శాతం తప్పు ఉన్నా ఏ శిక్షకు అయినా నేను సిద్ధమన్నారు.

మంత్రి పదవి లేకుండా బతకలేవా…

సీఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను ఎందుకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ కనీసం రెండు నెలలు పదవి నుంచి తప్పుకోలేరా? మంత్రి పదవి లేకపోతే ఏమవుతదని అన్నారు. కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కేటీఆర్, ఆయన సతీమణి పై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని రేవంత్ నిలదీశారు.

కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన దండు… నా అక్రమ నిర్మాణాలు ఎక్కడో చూపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. 1990 లో తన శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో విచారణకు అదేశించగా బాధ్యత వహిస్తూ అప్పటి మున్సిపల్ మంత్రి కోనేరు రంగారావు తన  పదవి కి రాజీనామా చేశారని గుర్తు చేశారు. విచారణలో అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధం లేదు అని తేలాక మళ్ళీ మంత్రి పదవి తీసుకున్నారన్నారు.

నా భూమి, నా బావమర్ది భూమిలో ఒక్క ఇంచు నిర్మాణం ఉంటే నేనే కూల్చి వేస్తానన్నారు. వట్టి నాగులపల్లి లో నాకు 22గుంటలు, నా బావమర్ధికి 20 గుంటలు ఉన్నాయని రేవంత్ వివరించారు.

You might also like