FbTelugu

రాజమండ్రిలో ప్రోటోకాల్ రగడ

తూర్పుగోదావరి: రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బోట్స్ కంట్రోల్ రూం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ చోటుచేసుకుంది. ఎంపీ భరత్ పేరును శిలాఫలకంలో చేర్చకపోవడంపై తీవ్ర వాగ్వాదం జరిగింది.

దీంతో అధికారులు శిలాఫలకాన్ని తీసుకెళ్లి ఆఫీసులో దాచారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. అధికారులెవ్వరైనా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. అది అపోజిషన్ అయినా, అధికార పార్టీ నేతలైనా కచ్చితంగా పాటించాలని అన్నారు. దీనిపై మంత్రి అవంతి, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

You might also like