FbTelugu

కరోనా విలయం… రాజభవన్ ముందు గొర్రెలతో నిరసన!

కొలకతా: రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, ఊహించని మరణాలు సంభవిస్తుండడంతో రాజభవన్ ముందు నిరసన చేయాలని ఒక సామాజిక సంస్థ నిర్ణయించింది.

ఏ రాష్ట్రంలో అయినా రాజభవన్ ముందు అసాధరణ భద్రత ఉంటుంది. కొలకతాలోని రాజభవన్ ముందు కూడా పశ్చిమ బెంగాల్ పోలీసులు భారీ గా ఉన్నారు. పాలకులపై తమ అక్కసును తెలియచేసేందుకు సామాజిక సంస్థ గొర్రెల మందతో రాజభవన్ ముందుకు చేరుకున్నది. ఈ అనూహ్య పరిణామానికి బందోబస్తులో ఉన్న పోలీసులు కంగుతిన్నారు. వెంటనే తేరుకుని వాటిని తరిమేయడానికి పరుగులు పెట్టారు. సుమారు పావు గంట పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిపేయడం, సోషల్ మీడియాలో గొర్రెల మంద వార్త హల్చల్ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా గవర్నర్ జగదీప్ ధన్కర్ నగర పోలీసు కమిషనర్, డిజిపికి సంజాయిషీ లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ లో సిఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ మధ్య ఉప్పునిప్పులా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.