FbTelugu

ఇళ్లు కేటాయించాలని సభలో నిరసన

అమరావతి: అందుబాటులో ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ సభ్యులు ర్యాలీ చేపట్టారు.

ఆ తరువాత టీడీపీ శాసనసభా పక్షం నాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ నేతలు నిరసనకు దిగారు. పేదలకు ఇళ్ల పట్టాల కోసం భూ సేకరణ పేరుతో అవినీతికి పాల్పడిన అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఇళ్లను నిర్మాణం చేసింది, 90 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన అన్నారు. టీడ్కొ ఇళ్లలో 10 శాతం పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో మూడు కేటగిరీల్లో నిర్మించిన ఇళ్లు ఉచితంగా అందచేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి రాగానే మాట మార్చారని రామానాయుడు అన్నారు. పేదలందరికీ ఉచితంగానే ఇళ్లను పంపిణీ చేసి మాట నిలుపుకోవాలని ఆయన సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.