FbTelugu

వాళ్లని కించపరచాలని నా ఉద్దేశం కాదు: కిరణ్ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి నిరసన సెగ తగిలింది. వైద్యుల నిరసనపై కిరన్ బేడీ స్పందించారు. డాక్టర్లని కించపరచడం తన ఉద్దేశం కాదని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవ్వరినైనా బాధిస్తే చింతిస్తున్నానని అన్నారు. నిన్న ఓ ఆస్పత్రిని సందర్శించిన కిరణ్ బేడీ కరోనా కేసుల వెల్లడిలో జాప్యం, తదితర అంశాలపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే కరోనా వైద్యులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలంతా మనసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే మంచిదని అన్నారు.

You might also like