FbTelugu

తాగుబోతు పెళ్లాం నుంచి రక్షించండి ప్రభో…

అహ్మదాబాద్: మహిళలు సాధారణంగా భర్త వేధింపుల నుంచి రక్షించడని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతారు. దీనికి పూర్తి విరుద్ధంగా ఒక భర్త పోలీసు స్టేషన్ వెళ్లి భార్య నుంచి కాపాడండని వేడుకున్నాడు.
మద్యం సేవించడం మగవారికే పరిమితం అనుకున్నాం. కాని అహ్మదాబాద్ లో ఒక మహిళ మద్యం సేవించి భర్తను పొట్టుపొట్టుగా కొడుతున్నది. ఆమె దెబ్బలు భరించలేక పోలీసులను ఆశ్రయించాడు. మణినగర్ కు చెందిన ఒక వ్యక్తికి రెండేళ్ల క్రితం ఒక మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన తరువాత భార్య మద్యం సేవిస్తున్నదని తెలిసింది. సరే తాగుతుంది కదా అని వదిలేశాడు. మందు తీసుకున్న తరువాత అత్త,మామాలతో పాటు భర్తను దూషించేది.

కొన్ని సమయాల్లో ఆవేశం పట్టలేక భర్తపై భౌతిక దాడి చేసేది. దీంతో భర్త శారీరకంగా, మానసికంగా కుంగిపోయాడు. ఎవరికైనా చెబితే పరువు పోతుందనే భయంతో ఓపికపట్టాడు. కొన్ని సందర్భాల్లో మద్యం సేవించి, పని చేసే ప్రాంతానికి వచ్చి నానా అల్లరి చేసేది. ఇక చేసేది లేక, భార్య పోరు భరించలేక తల్లిదండ్రులకు దూరంగా కాపురం పెట్టాడు.
ఇటీవలే తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ రావడంతో పాత ఇంటికి వచ్చి సఫర్యలు చేస్తున్నాడు. తనను వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్తావా అంటూ ఆగ్రహం చెందిన ఆమె దాడికి పాల్పడింది. ఆపై పోలీసు స్టేషన్ కు వెళ్లి అత్తమామలు, భర్తపై కేసు పెట్టింది. ఈ వేధింపులు భరించలేని ఆయన తప్పని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాడు. తాగుబోతు భార్య నుంచి కాపాడాలంటూ వేడుకున్నాడు. తనకు పోలీసు రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను ప్రాధేయపడ్డాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.