FbTelugu

దాడుల నుంచి మమ్మల్ని కాపాడండి…

Protect-us-from-attacks

సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం జరుగుతోంది

హైదరాబాద్: సోషల్ మీడియాలో రెవెన్యూ ఉద్యోగులపై విషప్రచారం జరుగుతోందని, దాడుల నుంచి ఉద్యోగులను రక్షించాలని కోరుతూ రెవెన్యూ సంఘాల జేఏసీ నాయకులు ఇవ్వాళ అడిషనల్ డిజీపీ జితేందర్ ను కలిసారు. అవినీతి పరులు, డబ్బులు ఇవ్వనితే పనిచేయరనే దుష్ప్రచారం రెవెన్యూ ఉద్యోగుల మీద విపరీతంగా జరుగుతోందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని నిలువరించాలని వారు కోరారు. అబ్దుల్లాపూర్ మెట్ ఘటన తరువాత వరుస సంఘటనలు తహశీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్నాయని వివరించారు. దాడుల నుంచి ఉద్యోగులకు రక్షించాలని కోరుతూ జితేందర్ కు వినతి పత్రం అందచేశారు. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, టీజీటీఏ అధ్యక్షులు రాములు, టీవీఆర్ఓడబ్ల్యూఏ అధ్యక్షులు గరికే ఉపేందర్ రావు, ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మీనారాయణ, టీవీఆర్ఓఏ ప్రధాన కార్యదర్శి బి.సుదర్శన్ ఉన్నారు.

You might also like