FbTelugu

ఫ్రంట్ లైన్ వారియర్స్ ని కాపాడుకోవాలి: చంద్రబాబు

అమరావతి: ఏపీలో ప్రముఖ వైద్యులతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలపై చర్చ జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు వారాల్లో ఏపీలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉందని అన్నారు. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ ని కాపాడుకోవాలని అన్నారు. మరణాల్లో ఏపీ దేశంలోనే రెండవ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో మహమ్మారి వ్యాధిపై అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నట్టు తెలిపారు. ఎక్కువ మంది పేషెంట్లను ఒకే అంబులెన్సులో తీసుకెళ్తున్నట్టు తెలిపారు.

You might also like