FbTelugu

ఇంటి పన్ను మాఫీ చేయాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: హెల్త్ ఎమర్జెన్సీ దృష్ట్యా ఏడాది పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటిపన్ను మాఫీ చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవాళ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ ను కలిశారు. కరోనా వైరస్, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవన పరిస్థితులు ఆగమ్యగోచరంగా మారాయన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి పన్ను కట్టే స్థోమత ప్రస్తుతం లేదన్నారు. ఇలా నష్టపోయిన ఇంటి పన్ను మొత్తాన్ని ఉన్నత వర్గాల నుంచి వసూలు చేసినా అభ్యంతరం లేదన్నారు.

ఈ అంశంపై త్వరగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు అభిప్రాయం తీసుకోవాలని కమిషనర్ ను కోరారు. ఆర్థిక పరిస్థితి బాలేదని ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. మరి అలాంటప్పుడు, పేద, మధ్యతరగతి వారికి లాక్ డౌన్ సమయంలో ఆదాయం లేనందున ఒక ఏడాది పాటు ఇంటి పన్ను మాఫీ చేయాలన్నారు.

విద్యుత్ చార్జీల అంశంపై సీఎం కేసీఆర్ కు  రేవంత్ రెడ్డిలేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ఉపాధి లేక, ఆదాయం రాక కుటుంబాలను పోషించుకోలేకపోతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ షాక్ ఇస్తున్నారని మండిపడ్డారు. మూడు నెలల విద్యుత్ వినియోగాన్ని కలిపి లెక్కించడంతో స్లాబులు మారిపోతున్నాయని, దీనివల్ల ప్రజలపై మూడు రెట్ల అధిక భారం పడుతోందని ఆరోపించారు.

సాధారణంగా 100 యూనిట్ల స్లాబులో ఉండే వినియోగదారులు ఇప్పుడు 300 యూనిట్ల స్లాబులోకి వచ్చారని ఆయన వివరించారు. విద్యుత్ చార్జీల మదింపుతో పేద, మధ్య తరగతి ప్రజల జేబుకు ప్రభుత్వం చిల్లు పెడుతోందని రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఒక్క రూపాయి అదనపు భారం పడినా చూస్తూ ఊరుకోబోమని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.