FbTelugu

స్తిరాస్థి రిజిస్ట్రేషన్లు షూరూ

హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా 20 రోజుల పాటు పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.

లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో తిరిగి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్ర ఖజానాలో నిల్వలు నిండుకోవడం ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వక తప్పలేదు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు గరిష్టంగా 24 వరకు చేయనున్నారు. ఇద్దరు రిజిస్ట్రార్లు ఉన్నట్లయితే 48 వరకు చేయాలని నిర్ణయించారు. స్లాట్ బుక్ చేసుకున్నవారినే కార్యాలయం లోనికి అనుమతిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో పాస్ పోర్టు కార్యాలయాలు, బ్యాంకులు పని గంటలు పెంచాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాస్ పోర్టు సేవలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకు సేవలు లభ్యమవుతాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.