FbTelugu

రిలీజు అయిన ఎవరో మీలో కోటీశ్వరులు ప్రోమో

హైదరాబాద్: ఒకప్పుడు హీరో, హీరోయిన్లు పెద్ద తెరకే పరిమితం అయ్యారు. చిన్న తెర అంటే చిన్నబుచ్చుకునేవారు. చిన్న తెర ప్రేక్షకుల సంఖ్య పెరగడంతో హీరోలు, హీరోయిన్లు మనసు మార్చుకున్నారు.

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 1 లో అలరించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు మాదిరిగా ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఎన్టీఆర్ ప్రోమో షూట్ లో పాల్గొనగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ షూట్ తీసుకున్నారు. ఈ ప్రోమోను విడుదల చేశారు కూడా. తొలిసారి హీరో నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని తొలిసారి హోస్ట్ చేశారు. 2014లో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. అదే సంవత్సరం డిసెంబర్ లో రెండో సీజన్ కూడా జరుపుకున్నది. 2015 నవంబర్ లో మూడో సీజన్ చేయగా, మూడు సీజన్లకు నాగార్జున ప్రధాన వ్యాఖ్యాత గా వ్యవహరించారు. ఆ తరువాత 2017లో వచ్చిన నాలుగో సీజన్ లో హీరో చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.