FbTelugu

గ్రేటర్ లో గెలుపు ర్యాలీలు నిషేధం: పోలీసు కమిషనర్

హైదరాబాద్‌: గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని, 48 గంటల పాటు నిషేధం విధించామని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.

నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా కౌంటింగ్ తరువాత ర్యాలీలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో జీహెచ్ఎంసీ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశామని, లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవరికీ అనుమతి ఉండదని చెప్పారు. అనుమతి పత్రం ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశం కల్పిస్తామన్నారు.
ఓట్ల లెక్కింపునకు 15 ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పెట్రోలింగ్‌, పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ ఓల్డ్‌ మలక్‌పేటలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని అంజనీ కుమార్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.