FbTelugu

గూడ్స్ వాహనాల్లో మనుషుల రవాణా నిషేధం

చెన్నై: గూడ్స్ వాహనాల్లో ఎన్నికల ప్రచారానికి మనుషులను తరలిస్తే ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధిస్తామని రాష్ట్ర రవాణా కమిషణర్ జవహర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన వాహనాల్లో మాత్రమే బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారానికి ప్రజలను తరలించాలని ఆయన స్పష్టం చేశారు. గూడ్స్ వాహనాల్లో ప్రజలను తరలిస్తే వాహన యజమాని, డ్రైవర్ పై మోటార్ వాహన చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకుని స్వాధీనం చేసుకుంటామని, ఆరు నెలల జైలు శిక్ష తో పాటు రూ.10వేల జరిమానా విధిస్తామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.