FbTelugu

పుష్కర ఘాట్ రేప్ కేసులో పురోగతి

గుంటూరు: తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి చోటుచేసుకున్నది. నిందితులను గుర్తింపు ఒక కొలిక్కి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

నిందితులు తాడేపల్లి పట్టణం సీతానగరానికి చెందిన కృష్ణ, వెంకటేష్ లుగా పోలీసులు పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కర ఘాట్ల లో ఒంటరిగా ఉన్న వారిపై గతంలో కూడా దాడులు చేసినట్లు నిర్థారణకు వచ్చారు. దోచుకున్న సొమ్ముతో గంజాయి తాగి అఘాయిత్యాలు చేస్తున్నట్లుగా తేలింది. నాలుగు రోజుల క్రితమే నిందితులను అర్ధరాత్రి తిరుగుతుంటే ప్రత్యేక బృందం పోలీసులు పట్టుకున్నారు. నిందితులతో పోలీసు స్టేషన్ లో పరేడ్ నిర్వహించగా బాధితురాలు గుర్తించినట్లు తెలిసింది. దాస్ అనే వ్యక్తి దగ్గర ఫోన్లు తాకట్టు పెట్టినట్టు డబ్బులు తీసుకున్నట్లు పోలీసులకు నిందితులు తెలిపారు. త్వరలోనే మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టనున్నారు. బాధితురాలిని సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత జిజిహెచ్ లో పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం రూ.50వేల ఆర్థిక సాయం అందచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.