FbTelugu

బావి మృతుల కేసులో పురోగతి

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న బావి మృతుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.  గీసుగొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని బావిలో 9 మంది మృత దేహాలు బయల్పడిన కేసులో ఇవాళ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళితే.. మృతుల ఫోన్ కాల్ వివరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా మక్సూద్ కాల్ డేటా ఆధారంగా ఇద్దరు బీహార్ యువకులు సంజయ్ కుమార్, మోహన్(నిందితులు) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయువకుల వాగ్మూలం ఈ కేసుకు కీలకంగా మారనుంది. వివాహేతర సంబంధ కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

You might also like