FbTelugu

ఆయన ప్రొఫెసర్.. కప్పలతో ముచ్చటిస్తారు!

సిడ్నీ: ఆయన వృత్తి రీత్యా బయాలజీ ప్రొఫెసర్. కాని ప్రవృత్తిరీత్యా కప్పలతో ముచ్చటిస్తారు. ఆయనకు జంతువులపై ఎనలేని ప్రేమ కారణంగా కప్పలతో ఆయనను దగ్గర చేసింది.

ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ క్యాజల్ లో మైకెల్ మహోనీ బయాలజీ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. ఆయన అధ్యాపక వృత్తిలో ప్రవేశించిన తరువాత సైన్స్ ల్యాబ్ లో కప్పల కదలికలను గమనించేవారు. ఆ తరువాత వాటితో మమేకం అయి మాట్లాడే స్థాయికి వెళ్లిపోయారు. ఆయన చేసే శబ్ధాలకు కప్పలు స్పందిస్తాయి. విద్యార్థి దశ నుంచే వాటిని గమనిస్తున్నానని, అవి చేసే శబ్ధాలను అర్థం చేసుకుని అనుకరిస్తున్నట్లు మైకెల్ తెలిపారు. ప్రొఫెసర్ మైకెల్ ను పలువురు విద్యార్థులు, సహచర అధ్యాపకులు అభినందిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.