FbTelugu

జూన్ లో 10 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ల‌ ఉత్ప‌త్తి: సిరం

ముంబయి: సెకండ్ వేవ్ ఉధృతి తరువాత దేశంలో వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగింది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు జనం క్యూలో నిల్చుంటున్నా లభ్యం కావడం లేదు.

దేశంలోని రెండు కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మే నెలలో 6.5 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసిన సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో 10 కోట్ల ఉత్పత్తి చేయనున్నది. వాస్తవానికి జూన్‌లో 6.5 కోట్లు, జులైలో 7 కోట్లు, ఆగ‌స్ట్, సెప్టెంబ‌ర్‌ల‌లో ప‌ది కోట్ల చొప్పున వ్యాక్సిన్లు త‌యారు చేస్తామ‌ని మే నెల మొద‌ట్లో సీరం తెలిపింది. అయితే తాజాగా జూన్‌లోనే కొవిషీల్డ్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని 10 కోట్ల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిరం ఇనిస్టిట్యూట్ లేఖ రాసింది. అయితే ఉత్పత్తి అవుతున్న పది కోట్ల డోసుల్లో ఇండియాకు ఎన్ని ఇస్తారు, ఇతర దేశాలకు ఎన్ని డోసులు ఎగుమతి చేస్తారనేది స్పష్టం చేయలేదు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ తమ ఉత్పత్తి సామర్థ్యం పెంచుతున్నట్లు ప్రకటించింది కాని తాజాగా ఎంత ఉత్పత్తి పెంచింది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. విదేశాలకు వెళ్లేవారు కోవిషీల్డ్ వేయించుకోవడం మూలంగా మార్కెట్లో కొరత ఏర్పడింది. తెలంగాణ, ఏపి ల్లో కోవాగ్జిన్ తప్ప కోవిషీల్డ్ లభ్యం కావడం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.