FbTelugu

పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత

హైదరాబాద్: టీవీ ఆర్టిస్టు కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు.

ఆయన ఆచూకీ కోసం సంజీవరెడ్డి నగర్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ ముగిసిందని, నిందితులు దేవరాజ్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి లను మీడియా ముందు ప్రవేశపెడుతున్నట్ల వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు వీరి మధ్య జరిగిన ఆడియో, వీడియో కాల్స్ రికార్డులను పరిశీలించామన్నారు. తామంటే తాము కాదని ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారని, వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నామని ఆయన చెప్పారు.

దేవరాజ్ రెడ్డి, సాయి రెడ్డి లను కరోనా పరీక్షల కోసం పంపించామని, నివేదిక రాగానే వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా తల్లిదండ్రులతో పాటు సాయి ఆమెను వేధింపులకు గురిచేస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించాయని డీసీపీ వివరించారు.

You might also like