FbTelugu

నిర్మాత బిఎ.రాజు గుండెపోటుతో మృతి

సినిమా జర్నలిస్టు, నిర్మాత బిఎ.రాజు హఠాన్మరణం తో టాలీవుడ్ లో ఒక్కసారిగా విషాదఛాయలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న హీరోలు దిగ్భ్రాంతికి గురయ్యారు.

కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో చనిపోయారు. నాలుగున్నర దశాబ్ధాలుగా టాలీవుడ్ పరిశ్రమలో రాణిస్తున్న సూపర్ హిట్ సినిపత్రిక ద్వారా పేరుపొందారు. భార్య జయ దర్శకత్వంలో పలు సినిమాలు నిర్మించారు. బిఎ.రాజు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో ఆయన ఒక జెంటిల్ మెన్, ఆయన ఆత్మకు శాంతి కలగాలని పోస్టు చేశారు. ఆయన మరణ వార్త తెలియగానే షాక్ కు గురయ్యానని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. పిఆర్ఓ గా ఆయన సినిమా పరిశ్రమకు గొప్ప సేవలు అందించారని కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.