FbTelugu

సిబిఎస్ఈ పై భగ్గుమన్న ప్రియాంకా వాద్రా

న్యూఢిల్లీ: సిబిఎస్ఈ బోర్డుపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా వాద్రా మండిపడ్డారు. కరోనా కేసులతో జనం అల్లాడుతుండగా సిబిఎస్ఈ పరీక్షలు పెడతామంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందంటూ ఆమె విరుచుకుపడ్డారు.

బోర్డు పరీక్షలు రద్దు చేయాలన్న విద్యార్థుల డిమాండ్ కు ప్రియాంక సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మహమ్మారి సమయంలో విద్యార్థులను బలవంతంగా పరీక్షలకు కర్చోమనడం సిబిఎస్ఈ బాధ్యతారాహిత్యమేనని ఆమె స్పష్టం చేశారు. బోర్డు పరీక్షలు రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. భౌతికంగా హాజరయ్యే అవసరం లేకుండా ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించాలని ప్రియాంక ట్వీట్ చేశారు.

మే నెలలో జరగాల్సిన బోర్డు పరీక్షలను రద్దు చేయాలని లేదా ఆన్ లైన్ లో నిర్వహించాలని కోరుతూ ఆన్ లైన్ లో నమోదు అయిన పిటీషన్ లక్ష మందికి పైగా విద్యార్థులు సంతకాలు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.