FbTelugu

ప్రియాంక ప్రతిపాదనకు యూపీ ఓకే

లక్నో: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయి ఉపాధి లేక అక్కడే ఉండలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో వలస కూలీలు మండు వేసవిలో కాలినడకనే వందల కిలోమీటర్లు నడుస్తూ మధ్యలోనే ఎందరో ప్రణాలు విడుస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వలస కార్మికులను రాష్ట్రంలోని వారి వారి ఇళ్లకు చేర్చేందుకు 1,000 బస్సుల సమకూర్చనున్నట్టు తెలపగా దానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో వేల మంది వలస కార్మికులకు ఎంతో మేలు జరిగినట్టు తెలుస్తోంది.

You might also like