FbTelugu

అలాంటి వారికోసం ప్రార్థించండి: ప్రియాంక

Priyanka-Chopra-Trobled-Due-To-Pollution

భారతీయ స్టార్ నటి ప్రియాంక చోప్ర ఢిల్లీలో కాలుష్యం కారణంగా షూటింగ్‌లో పాల్గొనడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ‘ది వైట్‌ టైగర్‌ ’ అనే సినిమాలో నటిస్తుండగా.. షూటింగ్‌ ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమైంది. షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక.. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మాస్క్‌, కళ్లద్దాలు ధరించి సెట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నీ సౌకర్యాలున్న తమకే ఈ కాలుష్యంతో ఇబ్బంది ఇలా ఉంటే.. కనీసం ఇల్లు కూడా లేని నిరాశ్రయులు ఎన్ని కష్టాలు పడుతూ రోడ్ల మీద నివసిస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం ప్రార్థించండి’ అని ప్రియాంక ​పేర్కొన్నారు.

You might also like