FbTelugu

ప్రియమణి, పూర్ణలపై బన్నీ కామెంట్స్…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా పాపులర్ డాన్స్ షో ఢీ సీజ‌న్ 13 గ్రాండ్ ఫినాలెకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ డాన్సుల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి స్టార్ హీరో గెస్ట్‌గా ఢీ 13 షోకు రావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ ట్రైల‌ర్‌లో అల్లు అర్జున్ మాట్లాడిన మాట‌లు ఇంకా వైరల్ కావ‌డ‌మే. ఈ డాన్స్ షోకి ప్రియ‌మ‌ణి, పూర్ణ, గ‌ణేశ్ మాస్టర్‌ న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. షో ప్రారంభంలో హోస్ట్ ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ బాగా డాన్స్ చేస్తే ప్రియ‌మ‌ణిగారు ఒక హ‌గ్ ఇస్తారు. అదే పూర్ణ‌గారైతే ద‌గ్గ‌ర‌కు పిలిచి బుగ్గ‌ను కొరుకుతారు అని అన్నాడు. అప్పుడు వెంట‌నే బ‌న్ని.. ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తే.. అని అన‌గానే, ప్రియ‌మ‌ణి, పూర్ణ‌లు షాకయ్యి.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు. వారితో పాటు బ‌న్నీ కూడా న‌వ్వేశారు.

ఇక హైప‌ర్ ఆది మాట్లాడుతూ రుద్ర‌మదేవి చిత్రంలో బ‌న్నీ మాట్లాడిన డైలాగ్స్ గ‌మ్మునుండ‌వ‌య్యా ఓ టీమ్ స‌భ్యుల‌కు స‌రిపోతుంద‌ని వేదం సినిమాలో టీ ష‌ర్ట్ చూడ‌గానే తెలిసిపోతుంద‌నే డైలాగ్ మరో టీమ్‌కు స‌రిపోతుంద‌ని సెటైర్స్ వేసి అంద‌రినీ న‌వ్వించాడు. ఇక షోలో భాగంగా ఓ టీమ్ బ‌న్నీ హీరోగా న‌టించిన తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఏదో ఒక రాగం వింటున్న పాట‌కు పెర్ఫామ్ చేశారు. వారి పెర్ఫామెన్స్‌కు జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించిన ప్రియ‌మ‌ణి, పూర్ణ‌, గ‌ణేశ్ మాస్ట‌ర్స్ ఫిదా అయ్యారు. వెంట‌నే ఆ గ్రూపులో మెయిన్‌గా వ్య‌వ‌హ‌రించిన అమ్మాయిని పూర్ణ ద‌గ్గర‌కు పిలిచి బుగ్గ కొరికింది. దానికి బ‌న్నీ కూడా నొప్పితో విల‌విల‌లాడిన‌ట్లు రియాక్ట్ అవుతూ బుగ్గ తుడుచుకోవడం కొసమెరుపు. దీనిపై బ‌న్నీ మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎంతో అదృష్ట‌వంతురాలు.. ఎందుకంటే ఇంత‌కంటే ఎక్కువ డాన్స్ చేసుంటే ఏమైపోయేదో అని అన్నాడు. దానికి పూర్ణ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.