FbTelugu

కరీంనగర్ పోలీసులపై ప్రివిలేజ్ మోషన్

Privilege-Motion-on-Karimnagar-Police

ఢిల్లీ: కరీంనగర్ పోలీసులపై ఎంపీ బండి సంజయ్ ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు సమర్పించారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన స్పీకర్ ఓం బిర్లా, విచారణ చేపట్టాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ కు ఆదేశించారు. విచారణ త్వరగా ముగించి నివేదిక సమర్పించాలని కోరారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన విషయాన్ని స్పీకర్ కు వివరించారు. బండి సంజయ్ తో పాటు స్పీకర్ ను బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం కలిశారు. దాడి చేసిన పోలీసు అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారని సంజయ్ తెలిపారు.

You might also like