FbTelugu

ఆర్టీసీ ఆస్తుల కోసమే ప్రైవేటీకరణ జపం: బీజేపీ లక్ష్మణ్

Privatization-on-behalf-of-RTC-assets-says-BJP-Laxman

హైదరాబాద్: ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిన టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ ఆరోపించారు. న్యాయమైన డిమాండ్ల కోసం 35 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పిలిచి చర్చించాల్సింది పోయి సీఎం కేసీఆర్ వారి పట్ల బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సామాన్యుడి రావాణా సాధనంగా పేరుగాంచిన ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. తప్పుడు సమాచారంతో హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆర్టీసీ కార్మికులు, వారి పోరాటానికి మద్దతిస్తోన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతోందన్నారు. నవంబర్ 9న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఆర్టీసీ జేఏసీ నిర్వహిస్తోన్న మిలియన్ మార్చ్ కు బీజేపీ తెలంగాణ పూర్తి మద్దతునిస్తుంది. మిలియన్ మార్చ్ లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని లక్ష్మన్ పిలుపునిచ్చారు.

You might also like