FbTelugu

కెసిఆర్ కు ప్రైవేటు టీచర్ల పాలాభిషేకం

హైదరాబాద్: ప్రైవేటు టీచర్ల పట్ల కరుణ చూపిన ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నెలకు రూ.2000 లు, 25 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రైవేట్ టీచర్లు ధన్యవాదాలు తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాగార్జున సాగర్ లో ఉపాధి లేక ఒక ప్రైవేటు టీచర్ ఉరేసుకోగా, ఆ బాధతో భార్య కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలసిందే. వీరి దీనస్థితిని గమనించిన కెసిఆర్ పూటగడిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు విద్యా సంస్థలు తెరిచే వరకు నెలకు రూ.2వేలు, 25 కిలోల బియ్యం ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. సిఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నేడు అంబర్ పేటలోని ప్రైవేట్ పాఠశాలలో టీచర్లు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల తరఫున కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే ఈ యొక్క కరోనా వైరస్ అంతం  తిరిగి విద్యాసంస్థలు తెచ్చుకునే విధంగా కావాలని భగవంతుని కోరుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.