FbTelugu

ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యానికి పరాకాష్ట

గుంటూరు: జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన వృద్ధురాలికి కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ అంటూ.. నిర్ధారించారు. దీంతో ఆ వృద్ధురాలిని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన ఈ ఒక్క రిపోర్టుతో ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్ కు వెళ్లారు.

జీజీహెచ్ లో గుండెపోటుతో ఆ వృద్ధురాలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు లేకుండానే దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ తతగం అంతా అయిపోయిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. ఆ వృద్ధురాలుకి కరోనా నెగిటీవ్ అని రిపోర్టులు తారు మారైనట్టు తెలిపారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆ ప్రైవేటు ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

You might also like