FbTelugu

ప్రైవేటు హాస్పిటల్ అగ్నిప్రమాదం… నలుగురు మృతి

ముంబయి: థానే లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు రోగులు సజీవ దహనం అయ్యారు.
ఇటీవల ముంబయికి సమీపంలోని విరార్ లో ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన మరువక ముందే థానేలో మరో ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

థానే లోని కౌసా ప్రాంతంలో ఉన్న ప్రైమ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఐసియులో చికిత్స పొందుతున్న 20 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.