FbTelugu

లోన్ యాప్ నిర్వాకం.. లక్షకు 6 లక్షలు వసూలు

* ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య
తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ ల అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. లోన్ యాప్ పై నిషేధం విధించి వాటిని ఎవరూ వినియోగించవద్దని సూచించినప్పటికీ పలు చోట్ల లోన్ యాప్ ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి.

తీసుకున్న లక్ష రూపాయలకు వడ్డీతో 6 లక్షల రూపాయలు వసూలు చేయడంతో పాటూ వేధింపులు భరించలేక ప్రైవేట్ ఉద్యోగి చంద్రమోహన్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.