FbTelugu

కోదాడలో ప్రైవేటు బస్సు బోల్తా

సూర్యాపేట: కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 39 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్ నుంచి అర్థరాత్రి బయలుదేరి తెనాలి వెళ్తున్న సందర్భంగా ప్రమాదానికి గురైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కోదాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మిగతా ప్రయాణీకులను వేరే బస్సులో పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.