FbTelugu

కంటైనర్‌ ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు

* ఐదుగురు దుర్మరణం, ముగ్గురికి గాయాలు
లక్నో: ఓ కంటైనర్ ను ప్రైవేటు ఏసీ బస్సు వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌ జిల్లాలో లక్నో-ఆగ్రా జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బీహార్‌ నుంచి ఢిల్లీకి వెళుతున్న ప్రైవేట్‌ స్లీపర్‌ క్లాస్‌ ఏసీ బస్సు ప్రమాదవశాత్తూ ముందువెళుతున్న ఓ కంటైనర్ ను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు సగం వరకు కంటైనర్ లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రకి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.