FbTelugu

కరోనా చికిత్స పొందుతున్న ఖైదీలు పరారీ

పశ్చిమ గోదావరి: కరోనా చికిత్స పొందుతున్న ఇద్దరు ఖైదీలు పరారైన ఘటన జిల్లాలోని ఏలూరు సీఆర్ఆర్ కోవిడ్ సెంటర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో వారిని కోవిడ్ సెంటర్ కు తరలించారు. కాగా చికిత్స పొందుతున్న వారిలో ఇవాళ తెల్లవారు జామున ఇద్దరు పరారయ్యారు. ఈ ఘటనపై ఏలూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పరారైన వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

You might also like