FbTelugu

వన్యప్రాణులకు హానిచేస్తే ఏడేళ్ల జైలు

హైదరాబాద్: వన్యప్రాణులకు హానికలిగిస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని అటవీశాఖ వైల్డ్ లైఫ్ ఓఎస్డీ శంకరన్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. వేసవి పరిస్థితులతోనే వన్యప్రాణులైన పులులు, చిరుతలు, ఇతర జంతువులు జనావాసాల్లోకి వస్తాయని తెలిపారు.

అవి నీటికోసమే అలా వస్తాయని తెలిపారు. జాతీయజంతువు పెద్దపులిని రక్షించడం అటవీశాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు మూడు వేల పులులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.