FbTelugu

రూ.2వేల నోట్ల ముద్రణ బంద్: ఆర్బీఐ

ముంబై: రూ.2వేల విలువ కల నోట్ల ముద్రణపై ప్రజలు అనుకుంటున్న విధంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాంబు పేల్చింది. గత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు ప్రకటించింది.

చలామణిలో మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2వేల నోట్ల సంఖ్య 2018 మార్చి నాటికి 3.3 శాతం ఉన్నట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఈ విలువ 2019 మార్చి నాటికి 3 శాతం, మార్చి 2020 నాటికి 2.4 శాతానికి తగ్గిందన్నారు. మహాత్మా గాంధీ కొత్త సీరీస్ తో వచ్చిన రూ.10 నోట్లలో నకిలీవీ 144.6 శాతం, రూ.50 నకిలీలో నోట్లు 28.7 శాతం, రూ.200 నకిలీ నోట్లు 151.2 శాతం, రూ.500 నకిలీ నోట్లు 37.5 శాతం పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది

You might also like