FbTelugu

3వ తరగతి బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారయత్నం

Principal-rape-attempt-on-3rd-grade-girl

హైదరాబాద్: ఓ ప్రిన్సిపాల్ మూడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన నగరంలోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంతిజార్ అలీ అనే వ్యక్తి మోషియన్ పేరుతో కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌లో ప్రీ ప్రైమరీ స్కూల్‌ నిర్వహిస్తున్నాడు. అయితే అందులో చదువుతున్న బాలిక తల్లిదండ్రులు ఆర్థిక సమస్యలతో ఫీజు కట్టలేకపోయారు. త్వరలోనే ఫీజు చెల్లిస్తామని పరీక్షలకు అనుమతించాలని కోరారు. దీనికి సరేనన్న ప్రిన్సిపాల్ ఆధార్, ఇతర పత్రాలు తీసుకొస్తే పరీక్షకు అనుమతిస్తానని ఇంతిజార్ వారికి చెప్పాడు. ప్రిన్సిపాల్ అడిగిన పత్రాలు తీసుకుని విద్యార్థిని తల్లిదండ్రులు స్కూలుకొచ్చారు. అయితే, కంప్యూటర్ పనిచేయడం లేదని చెప్పిన అలీ.. వారిని ఇంటికి పంపేసి విద్యార్థినిని స్కూల్లోనే ఉండమన్నాడు. సాయంత్రం బాలికను పిలిచి ఆధార్ కార్డును పరిశీలిస్తున్నట్టు నటిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంటికెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఇంతిజార్ అలీని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని బహదూర్‌పురా మండల డిప్యూటీ ఈవో వేణుగోపాలాచారి తెలిపారు.

You might also like