FbTelugu

కొద్ది మందితో బ్రిటన్ రాకుమారి పెళ్లి

లండన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రిన్స్ ఆండ్రూ పెద్ద కుమార్తె ప్రిన్సెస్ బీట్రెస్ ఇటలీ వ్యాపారవేత్త మాపెల్లి మొజ్జిని వివాహమాడారు.
శుక్రవారం విండ్సర్ రాయల్ లాడ్జీ లోని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ లో జరిగిన ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

వీరి వివాహం ముందుగా నిర్ణయించిన ప్రకారం లండన్ లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో జరగాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తించడంతో వాయిదా వేశారు. శుక్రవారం నిరాడంబరంగా పెళ్లి వేడుకలు జరిగాయని బకింగ్ హమ్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.

You might also like