FbTelugu

సర్కార్ గిఫ్ట్… వద్దన్న రాజకుమారి

అమస్టర్ డ్యామ్: ఈ రోజుల్లో ఎవరైనా డబ్బులు ఇస్తామంటే అప్పనంగా తీసుకుంటారు. అది కూడా కోట్ల రూపాయలు అయితే మారు మాట్లాడకుండా గబుక్కున తీసేసుకుంటారు. కాని ఆ బాల రాకూమారి సున్నితంగా తిరస్కరించి శెహబాష్ అనిపించుకుంటున్నారు.
కొన్ని దేశాల్లో రాజవంశీయులకు అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక అలవెన్సుల కింద ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల డబ్బులు ఇస్తుంటాయి. నెదర్లాండ్స్ చక్రవర్తి విలియమ్ అలెగ్జాండర్ రాజకుటుంబానికి కూడా ఆ దేశ సర్కార్ ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తుంది.

అలెగ్జాండర్ ప్రథమ కుమార్తె ప్రిన్సెస్ అమాలియా రానున్న డిసెంబర్ నెలలో 18వ ఏట అడుగుపెట్టబోతున్నది. యవ్వనంలో అడుగుపెడుతున్న ఆమెకు పాకెట్ మనీ కింద రూ.14 కోట్లు ఇచ్చేందుకు నెదర్లాండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రతిపాదనను అమాలియా వద్దని చెప్పింది. కష్టపడకుండా డబ్బులు తీసుకోవడం సరికాదని, ఆ సొమ్ము తనకు వద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాచరిక నిబంధనల ప్రకారం తనకు డబ్బులు వస్తాయని, కాని ఆ మొత్తం తీసుకోవడం తనకు ఇష్టం లేదని ప్రధాని కి లేఖ రాసింది. ఆ డబ్బును సేవల కోసం వినియోగించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. కరోనా మహమ్మారితో నా తోటి విద్యార్థులు ఎంతో కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో నేను డబ్బులు తీసుకోవడం సరైంది కాదని తెలిపింది. ప్రిన్సెస్ అమాలియా నిర్ణయంపై నెదర్లాండ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.