FbTelugu

బ్రిటన్ క్వీన్ భర్త ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత

లండన్: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) కన్నుమూసినట్లు బకింగ్ హ్యామ్ ప్యాలెస్ ఒక ప్రకటన చేసింది. విండ్సర్ కాజిల్ లో శుక్రవారం ఫిలిప్ తుదిశ్వాస విడిచారని వెల్లడించింది.

స్వల్ప అస్వస్థత కారణంగా లండన్ లోని కింగ్ ఎడ్వర్డ్-7 హాస్పిటల్ లో ఫిబ్రవరి 17న చేరారు. చికిత్స తరువాత మార్చి 1న సెయింట్ బార్తోల్ మ్యూస్ హాస్పిటల్ కు తరలించారు. గుండె శస్త్ర చికిత్స తరువాత మార్చి రెండో వారంలో ఆయనను డిశ్చార్జీ చేశారు. చికిత్స పొందుతునే ఫిలిప్ కన్నుమూశారని రాయల్ ఫ్యామిలీలోని సభ్యులకు సమాచారం పంపించినట్లు బకింగ్ హ్యామ్ ప్యాలెస్ పేర్కొంది.

1921 జూన్ 10న గ్రీక్ ఐలాండ్ లోని సంపన్న కుటుంబంలో జన్మించిన ఫిలిప్ నేవీ ఆఫీసర్ గా పనిచేశారు. 1928 లో ఇంగ్లండ్ వచ్చారు. క్వీన్ ను 1947 లో వివాహం చేసుకున్నారు. రాజ దంపతులకు నలుగురు సంతానం కాగా ఎనిమిది మంది మనుమలు, 10 మంది ముని మనవళ్లు ఉన్నారు. ఈ ఏడాది జూన్ 10న ఆయన తన వందవ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విషాదం చోటు చేసుకున్నది. కరోనా వైరస్ మహమ్మారి మొదలు ఇప్పటి వరకు రాజ దంపతులు విండ్సర్ కాజిల్ లోనే ఉంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.