FbTelugu

3 వ్యాక్సిన్ కంపెనీలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలు, విడుదల, ప్రజలకు పంపిణీ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో ప్రధానంగా వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మూడు ఫార్మా సంస్థల ప్రతినిధులతో మాట్లాడనున్నారు.
జెనోవా బయో ఫార్మా, బయలాజికల్ ఈ. లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ఫార్మా బృందాలతో వ్యాక్సిన్ పురోగతి, ప్రయోగాలపై ప్రధాని చర్చించనున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ వ్యాక్సిన్ పనితీరును పర్యవేక్షించేందుకు సుడిగాలి పర్యటన జరిపిన విషయం తెలిసిందే.

తొలుత గుజరాత్, ఆ తరువాత హైదరాబాద్, పూణే నగరాల్లోని కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఫార్మా కంపెనీ అధిపతులు, శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. వ్యాక్సిన్ ప్రయోగాల పురోగతి ఎలా ఉంది, ఎప్పటికల్లా ప్రయోగాలు పూర్తవుతాయి, నివేదికలు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి పంపిణీ చేయవచ్చనే అంశాలపై కంపెనీ అధిపతులను అడిగి తెలుసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.