FbTelugu

28న హైదరాబాద్ కు ప్రధాని

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 28వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఆయన నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట చేరుకుంటారు.

అక్కడి నుంచి శామీర్ పేటలోని జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీని సందర్శించి, వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించనున్నారు. హైదరాబాద్ నగరం దేశంలోనే వ్యాక్సిన్ హబ్ గా గుర్తింపు పొందింది.ఇప్పటి వరకు నిర్వహించిన ట్రయల్స్ సమాచారం తెలుసుకోవడంతో పాటు, ఎంత వరకు విజయవంతం అయ్యిందనే దానిపై శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో చర్చించనున్నారు. ఆ తరువాత మహారాష్ట్రలోని పుణే నగరానికి వెళ్లనున్నారు. అక్కడ సిరం ఇనిస్టిట్యూట్ ను సందర్శించి వ్యాక్సిన్ పై ఆరా తీయనున్నారు. నగరంలో గ్రేటర్ అభ్యర్థుల కోసం ప్రధాని రోడ్డు షో నిర్వహిస్తారా లేదా అనేది ఇంకా వెల్లడి కాలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.