FbTelugu

పార్లమెంటులో అత్యాచారం… క్షమించండి: ప్రధాని

కాన్ బెర్రా: ఆస్ట్రేలియా దేశం పార్లమెంటులో ఒక మహిళా ఉద్యోగిని దారుణంగా అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ గటనపై దేశ ప్రధాని స్కాట్ మారిసన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ఆయన క్షమాపణలు చెప్పడమే కాకుండా బాధిత మహిళకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల క్రితం 2019 మార్చి నెలలో పార్లమెంట్ లో రక్షణ మంత్రి లిండా రెనాల్డ్ ఆఫీసు లో తనపై అత్యాచారం జరిగిందని ఒక మహిళ ఇటీవలే బయటకు చెప్పింది. తనకు జరిగిన ఘోర అవమానంపై మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నది. ఘటన జరిగిన మరుసటి నెలలోనే పోలీసులకు చెప్పానని, తన భవిష్యత్తు నాశనమవుతుందనే భయంతో ఫిర్యాదు చేయలేదన్నారు. మార్చి నెలలో రెనాల్డ్ కార్యాలయంలో పనిచేసే అధికారి సమావేశం ఉందని పిలిచాడు. ఆ తరువాత తనను రేప్ చేశాడని తెలిపింది.

ఆమె ఆరోపణలపై రక్షణ మంత్రి రెనాల్డ్ స్పందించారు. అత్యాచారం జరిగిందని పోలీసులకు చెప్పిన మాట వాస్తవమేనని, అయితే కేసు పెట్టకుండా ఆమెను ఎవరు బెదిరించలేదన్నారు. ఈ విషయాన్ని బాధిత మహిళ కూడా అంగీకరించిందని మంత్రి వెల్లడించారు. ఈ విషయం తెలియగానే ప్రధాని స్కాట్ క్షమాపణలు కోరారు. పని చేసే ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సి కాదని, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విచారణ జరిపి సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.