ఉలాన్ బాతర్: కరోనా వైరస్ ను నియంత్రించలేక ఏకంగా ఒక దేశానికి చెందిన ప్రధాన మంత్రి తన పదవికి రాజీనామా సమర్పించారు. మొదటి దశలో నియంత్రించినప్పటికీ రెండో దశ వ్యాప్తి నియంత్రించండం సాధ్యకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంగోలియా దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతున్నది.
ఒక కరోనా రోగి, ఒక చిన్నారికి పునరావాసం కల్పించడంతో ప్రభుత్వం విఫలమైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దేశంలో పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలను తట్టుకోలేక ప్రధాన మంత్రి ఖురేసుఖ్ ఉక్నా తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్న వైరస్ ఒక దేశ ప్రధాన మంత్రికి శాపంగా మారడం దారుణంగా చెప్పుకోవచ్చు.