* కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: నూతనంగా నిర్మించ తలపెట్టిన పార్లమెంటు భవనానికి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరైనారు. రూ.971 కోట్లతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నారు.
మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. అత్యధునిక సాంకేతికతతో కొత్త పార్లమెంటును నిర్మింస్తున్నట్టు తెలిపారు. నాలుగు అంతస్తుల్లో పార్లమెంట్ కొత్త భవనం నిర్మిస్తున్నట్టు తెలిపారు. లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునే అవకాశం ఉంటుందని తెలిపారు.