FbTelugu

మిక్సింగ్ వ్యాక్సిన్ తీసుకున్న ఇటలీ ప్రధాని

రోమ్: మన దేశంలో ఇప్పటి వరకు రెండు డోసుల వ్యాక్సిన్లలో వేర్వేరు కంపెనీలకు చెందిన వాటిని ఎవరైనా ప్రమాదవశాత్తు వేసుకుంటే గాబరా పడుతున్నాం. అలాంటి ప్రయోగాన్ని ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి చేశాడు.

అయితే వైద్య నిపుణుల సూచన మేరకు ప్రధాని రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన డోసులను తీసుకున్నారు. మారియో తొలి డోసు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్నారు. తక్కువ సంఖ్యలో యాంటీబాడీలు వృద్ధి అయ్యాయి. వైద్యుల సూచన మేరకు ఆయన రెండో డోసు ఫైజర్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ ను తీసుకున్నారు. రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన డోసులను తీసుకున్న ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. జర్మనీ వైస్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ కూడా మిక్సింగ్ వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఫస్ట్ డోసు ఆస్ట్రాజెనెకా కంపెనీది తీసుకోగా, సెకండ్ డోసు మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.