FbTelugu

ఆక్సిజన్ కొరతపై ప్రధానికి సిఎం ల మొర

న్యూఢిల్లీ: ప్రధాన నరేంద్ర మోదీ కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ సమావేశమయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో న్యూఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆక్సిజన్ కొరత ఉందంటూ పలువురు ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతున్నందున కొరత లేకుండా చూడాలని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కోరారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, తమ రాష్ట్రానికి రోడ్లు మార్గం ద్వారా వచ్చే ట్యాంకర్లను ఆపేసి తీసుకుంటున్నారని సిఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వాయు మార్గం ద్వారా తరలించే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.

వీడియో కాన్ఫరెన్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం పై ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సిఎం కేజ్రీవాల్ క్షమాపణలు కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని తెలిపారని, ప్రత్యక్ష ప్రసారం పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ సమావేశం తరువాత ప్రధాని మోదీ ఆక్సిజన్ తయారీదారులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.