FbTelugu

ప్రధాని మోదీకి నిద్ర కరువేనా!

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు పెద్ద రాష్ట్రాల్లో బిజేపియేతర పార్టీలకు ప్రజల పట్టం కట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ ఎన్నికలు దేశంలో సంకీర్ణ కూటమికి బాటలు వేశాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
దేశంలో తమకు ఉన్న బలం, బలగంతో విజయం సాధించడం కుదరదని బిజెపికి స్పష్టమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో పరాజయం తరువాత ప్రాంతీయ శక్తులు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం కల్పించినట్లు అయ్యింది. కాంగ్రెస్ పార్టీ కూనారిల్లడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.

కరోనా సెకండ్ వేవ్ ను ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్యం చేయడం, అదుపు చేయడంలో విఫలమయ్యారనే విమర్శలను ఎదర్కొంటున్నారు. ఈ మూడు రాష్ట్రాల విజయంతో మున్ముందు ప్రధానికి ప్రాంతీయ పార్టీలు నిద్ర లేకుండా చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు. బెంగాల్ లో గెలిచి తమ సత్తా చూపించుకుని ఎదురు లేకుండా పాలించాలని బిజెపి పెద్దలు భావించగా, తాజా ఫలితాలు చావుదెబ్బ కొట్టాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో బిజెపి తీరు పట్ల ఆగ్రహంతో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒకే తాటిపైకి వచ్చే వాతావరణం ఏర్పడింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు కు చెందిన ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యే సూచనలు ఉన్నాయి. వీరే కాకుండా బిజెపితో విభేధించే మిగతా పార్టీలు కూడా దగ్గరయ్యే ప్రమాదం పొంచి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.