FbTelugu

ప్రధాని మోదీ అత్యవసర సమావేశం…

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్, కొన్ని ప్రాంతాల్లో థర్డ్ వేవ్ ఊపందుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల సంఖ్య అనూహ్యం పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
కరోనా మ్యుటెంట్ వైరస్ విస్తరణతో పాటు దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌పై కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.

గతేడాదితో పోల్చితే ఈసారి కేసుల సంఖ్య సెన్సెక్స్ మాదిరి పెరుగుతుండడం, కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు పాటించకపోవడంతో కూడా కారణంగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రాల వారీగా పరిస్థితిని ప్రధానికి అధికారులు వివరించనున్నారు. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి, ప్రధాని ముఖ్య కార్యాదర్శి, ఆరోగ్య కార్యదర్శితో పాటు పలువురు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.