FbTelugu

భారత్ బయోటెక్ కు ప్రధాని మోదీ

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్ది సేపటి క్రితం ప్రత్యేక విమానంలో హకీంపేటలోని ఏయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీకి బయలుదేరారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి స్వాగతం పలికారు.

ఆ తరువాత ప్రత్యేక కాన్వాయ్ లో బయలుదేరి వెళ్లారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పురోగతిని అడిగి తెలుసుకోనున్నారు. ప్రధానికి వ్యాక్సిన్ పురోగతిని వివరించేందుకు కంపెనీ అన్నీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని పర్యటన కావడంతో హకీంపేట, రాజీవ్ రహదారి, జినోమ్ వ్యాలీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.