FbTelugu

ఆ సత్తా భారత్ కు ఉంది: మోదీ

న్యూఢిల్లీ: భారత సరిహద్దు తగాదాలను పరిష్కరించుకునే సత్తా భారత్ కు ఉందని ప్రధాని మోదీ అన్నారు. మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రజలతో పలు విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరిహద్దుపై సవాల్ విసిరిన వారిని ధీటుగా జవాబు చెప్పామని అన్నారు. దేశం కోసం 20 మంది భారత సైనికులు అత్యున్నత త్యాగం చేశారని అన్నారు. రక్షణ రంగంలో మన దేశం ఎన్నో దేశాల కంటే ముందుందని అన్నారు. ఈ 2020 వ సంవత్సరం ప్రజలకు ఎన్నో సమస్యలను తెచ్చిందని అనుకుంటున్నట్టు తెలిపారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కోగలమని మన చరిత్ర చెబుతుందని అన్నారు. భారత్ ఎప్పుడూ సమస్యలను అవకాశాలుగా మార్చుకుంటుందని అన్నారు.

You might also like